జైలర్ 2: బాలయ్య 10 నిమిషాల కామియోకు రూ. 22 కోట్ల రెమ్యూనరేషన్

Screenshot 2025 05 22 082352

సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’లో నందమూరి బాలకృష్ణ కీలక కామియో పాత్రలో కనిపించనున్నారు. 10 నిమిషాల ఈ పవర్‌ఫుల్ రోల్‌లో బాలయ్య, రజనీ, శివరాజ్‌కుమార్‌లతో కలిసి హై-ఇంటెన్సిటీ ఫైట్ సన్నివేశాల్లో మెరవనున్నారు. ఈ సీన్స్ ప్రేక్షకులకు మాస్ ఎలివేషన్ అందించేలా రూపొందినట్లు సమాచారం. ఆశ్చర్యకరంగా, ఈ పాత్ర కోసం బాలయ్య రూ. 22 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయగా, సన్ పిక్చర్స్ ఒప్పుకున్నట్లు తెలిసింది. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’ విజయాలతో ఊపు మీదున్న బాలయ్య, ‘జైలర్ 2’లో తన మాస్ ఇమేజ్‌ను మరింత ఉపయోగించనున్నారు. ఈ వార్త సినీ పరిశ్రమలో సంచలనం రేపుతోంది.