
బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్, టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జాట్’ థియేటర్లలో సంచలన విజయం సాధించింది. హిందీలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం, మాస్ ఆడియన్స్‌కు పర్ఫెక్ట్ ట్రీట్‌గా నిలిచింది. ఇప్పుడు ఓటిటి ప్రేక్షకులకు శుభవార్త! ‘జాట్’ జూన్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుందని బజ్ వినిపిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ చిత్రం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంటుందని సమాచారం. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో మిస్ అయినవారికి ఈ ఓటిటి రిలీజ్ గ్రాండ్ ట్రీట్ కానుంది. మేకర్స్ ఇప్పటికే ‘జాట్’ సీక్వెల్‌ను కూడా అనౌన్స్ చేశారు. మాస్ ఫ్యాన్స్‌కు ఈ అప్‌డేట్ ఫుల్ జోష్ ఇస్తోంది.