రాజమౌళి దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ఉందా? లేదా?

S. S. Rajamouli

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ సినీ ప్రియులను ఆకర్షిస్తుంది. ఈ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఇందులో నిజమెంత ఉందో తెలీదు. అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా? ఉంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?

భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథ ఆధారంగా రాజమౌళి ఓ గ్రాండ్ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేశారని ఆమధ్య వార్తలు వచ్చాయి. ఈ బయోపిక్‌లో జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తారని సమాచారం. అయితే, ఎన్టీఆర్, రాజమౌళి ప్రస్తుతం ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ మాత్రం తాత్కాలికంగా నిలిచిపోయింది. అసలు ఉంటుందో లేదో కూడా తెలియదు. అయితే రాజమౌళి మాత్రం ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. దాదాసాహెబ్ ఫాల్కే జీవితంలోని ముఖ్య ఘట్టాలు, భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషిని ఈ చిత్రం ఆవిష్కరించనుంది. ఈ సినిమా ఇప్పట్లో స్టార్ట్ కాకపోయినా భవిష్యత్తులో ఎప్పుడైనా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం రాజమౌళి ఫోకస్ అంతా SSMB 29 పైనే ఉంది. తారక్ ఫోకస్ డ్రాగన్, దేవర 2 పై ఉంది. వీళ్ళు ఈ సినిమాలు పూర్తి చేసి ఫ్రీ అవ్వాలంటే మినిమమ్ 4 సంవత్సరాల టైం కచ్చితంగా పడుతుంది కాబట్టి, ఈ ప్రాజెక్ట్ ఒకవేళ కన్ఫామ్ అయినా ఇప్పట్లో మాత్రం లేనట్టే అని టాక్.