ఆమీర్ ఖాన్ మహాభారతంలో ఐకాన్ స్టార్?

Screenshot 2025 05 14 135822

సినీ ప్రియులకు గుడ్ న్యూస్! బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ మహాభారతం ఆధారంగా ఓ భారీ సిరీస్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సిరీస్‌లో ఆమీర్ స్వయంగా కృష్ణుడి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అయితే, ఇందులో అర్జునుడి పాత్ర కోసం టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఎంపిక చేసే ఆలోచనలో ఆమీర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమీర్ ఖాన్ ఇటీవల ముంబైలో అల్లు అర్జున్‌తో భేటీ అయినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. మహాభారతం లాంటి భారీ ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్ నటిస్తే, అది భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సంచలనంగా నిలిచిపోతుందని అభిమానులు ఉత్సాహపడుతున్నారు. అల్లు అర్జున్, ఆమీర్ ఖాన్ లాంటి ఇద్దరు భిన్న శైలి నటులు ఒకే వేదికపై కలిస్తే ఆ అనుభవం ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌ ఇవ్వడం పక్కా. మరి, ఈ ప్రాజెక్ట్‌ కి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? ఈ భారీ సిరీస్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అనే ఆసక్తి అందరిలో నెలకొంది.