
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘SSMB 29’ సినీ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఆఫ్రికన్ అడవుల్లో సాగే ఈ గ్లోబల్ థ్రిల్లర్‌లో హాలీవుడ్ నటుడు డ్జిమోన్ హౌన్సౌ విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్‌ను వెంటాడే ఆఫ్రికన్ హంటర్ పాత్రలో డ్జిమోన్ మెరవనున్నాడు. ‘గ్లాడియేటర్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’, ‘రెబల్ మూన్’ వంటి హిట్ చిత్రాలతో గుర్తింపు పొందిన డ్జిమోన్, తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటాడు. రాజమౌళి లండన్‌లో డ్జిమోన్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. ప్రస్తుతం ‘ది మోన్ స్టార్’లో నటిస్తున్న డ్జిమోన్ ఎంపిక ఈ చిత్రంపై అంచనాలను పెంచింది. ఈ కాస్టింగ్‌తో ‘SSMB 29’ అంతర్జాతీయ ఆకర్షణ సొంతం చేసుకుంటుందని అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. సోషల్ మీడియాలో డ్జిమోన్ పేరు ట్రెండ్ అవుతోంది.