
‘హిట్ 3’ సినిమా క్లైమాక్స్ సన్నివేశం తెలుగు ప్రేక్షకుల్లో తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌ను శైలేష్ కొలను డైరెక్ట్ చేశారు. చిత్రంలో కార్తీ క్యామియో రోల్లో కనిపించి, ‘హిట్ 4’ లీడ్‌గా పరిచయమయ్యారు. థియేటర్లో ఈ సన్నివేశం అభిమానులను ఆకట్టుకున్నా, ఓటీటీ రిలీజ్ తర్వాత తమిళ డబ్బింగ్ వెర్షన్లో కార్తీ పాత్ర తెలుగు వారిని కించపరిచేలా ఒక పదం వాడినట్లు నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
తెలుగు దర్శకుడైన శైలేష్ సొంత ప్రేక్షకులను ఇలా చూపించడం సరికాదని అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో నాని, శైలేష్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ సన్నివేశం తెలుగు సంస్కృతిని, గుర్తింపును దెబ్బతీసిందని ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు. చిత్ర బృందం నుంచి ఇంతవరకు స్పష్టమైన సమాధానం రాకపోవడం వారి ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఈ సన్నివేశాన్ని సవరించాలని లేదా తగిన చర్యలు తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.