మాచో హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. టీజర్ , ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో గోపీచంద్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
‘భీమా’ జర్నీఎలా మొదలైయింది?
ఈ సినిమా సహా నిర్మాత శ్రీధర్ గారు, కోవిడ్ సమయంలో దర్శకుడు హర్షని పరిచయం చేశారు. అప్పుడు పేస్ టైంలో ఒక కథ చెప్పారు హర్ష. కథ బావుంది కానీ ఇలాంటి సమయంలో వద్దనిపించింది. పోలీసుకి సంబధించి ఏదైనా డిఫరెంట్ కథ వుంటే చెప్పమన్నాను. ఎనిమిది నెలలు గ్యాప్ తీసుకొని భీమా ‘కథ’ చెప్పారు. కథ, భీమా క్యారెక్టరైజేషన్ చాలా నచ్చింది. అలా కథలోని సెమీ ఫాంటసీ ఎలిమెంట్ కూడా చాలా నచ్చింది. అలా భీమా మొదలైయింది.
ఇప్పటికే మీరు పోలీసు పాత్రలు చేశారు కదా.. వాటికి భీమాకి ఎలాంటి వైవిధ్యం వుంటుంది?
గోలీమార్ లో డిఫరెంట్ కాప్. ఆంధ్రుడు లవ్ స్టొరీ మీద నడుస్తుంది కానీ దాని నేపధ్యం పోలీసు కథే. శౌర్యం కూడా భిన్నమైన కథ. ఈ మూడు చిత్రాలకు పూర్తి వైవిధ్యమైన పాత్ర భీమా. ఇలాంటి పోలీసు కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ చాలా కొత్తగా వుంటుంది. అదే నాకు చాలా ఆసక్తిని కలిగించింది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం వుంది.
చాలా మంది ‘అఖండ’ తోపులుస్తున్నారు కదా.. కథ విన్నప్పుడు మీకు అలా అనిపించలేదా?
లేదు. అఘోరాలు, కలర్ పాలెట్, మ్యూజిక్ వలన అలా అనిపించవచ్చు ఏమో కానీ భీమా పూర్తిగా డిఫరెంట్ స్టొరీ. అయితే నిజంగా ‘అఖండ’ పోలిస్తే మంచిదేగా (నవ్వుతూ). భీమా పరశురామక్షేత్రంలో జరిగే కథ. అందుకే అలాంటి నేపధ్యం తీసుకున్నాం.
భీమా కథ విన్నపుడు మీరు ఎలాంటి ఇన్ పుట్స్ ఇచ్చారు ?
కథ విన్న తర్వాత నాకు అనిపించింది చెప్పాను. అయితే హర్ష చాలా అనుభవం వున్న దర్శకుడు. చాలా అద్భుతంగా తీశాడు. చాలా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే చేశాడు. చాలా గ్రిప్పింగ్ గా వుంటుంది, మలుపులు, సెమీ ఫాంటసీ ఎలిమెంట్స్ చాలా కొత్తగా వుంటాయి. ఇందులో హీరో క్యారెక్టర్ పేరు భీమా. ఈ కథకు అదే పేరు యాప్ట్ అని టైటిల్ గా పెట్టడం జరిగింది.
‘భీమా’ ని బ్రహ్మరాక్షుడు అంటున్నారు.. పాత్ర ఎలా ఉండబోతుంది ?
రాక్షసుడిని చంపాలంటే బ్రహ్మరాక్షుడు రావాలని అలా పెట్టారు. భీమా కమర్షియల్ ప్యాక్డ్ మూవీ. భీమా పాత్రలో చాలా ఇంటన్సిటీ వుంటుంది. ప్రేమ, ఎమోషన్స్, రోమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. సినిమా చూసి బయటికి వచ్చాక భీమా ప్రేక్షకుడి మనసులో నిలబడిపోతాడనే నమ్మకం వుంది. ఈ కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ ని దర్శకుడు చాలా అద్భుతంగా బ్లెండ్ చేశాడు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ లో అద్భుతమైన ఎమోషన్ వుంటుంది. ఆ ఎమోషన్ కి ప్రేక్షకులు నచ్చుతుందనే నమ్మకం వుంది.
ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ పాత్రలు ఎలా వుంటాయి ?
ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ ఈ రెండు పాత్రలు సినిమాలో చాలా కీలకంగా వుంటాయి. కథకు కావాల్సిన పాత్రలు. పాత్రలకు ఒక పర్పస్ వుంటుంది.
రవిబస్రూర్ మ్యూజిక్ గురించి ?
ట్రైలర్ లో మ్యూజిక్ అద్భుతంగా వుంది. దానికి మించి సినిమాలో వుంటుంది. మంచి మ్యూజిక్ ఇవ్వాలనే అంకితభావంతో పని చేశాడు.
సినిమాలో శివుని నేపధ్యం వుంది. సినిమా మహా శివరాత్రికి వస్తుంది.. ఇలా ప్లాన్ చేశారా ?
లేదండీ. అలా కలిసొచ్చింది. శివుని ఆజ్ఞ అనుకుంటాను.
నిర్మాత రాధమోహన్ గారి గురించి ?
రాధమోహన్ గారు నాకు చాలా క్లోజ్. ఆయనతో గతంలో పంతం సినిమా చేశాను. మేముచాలా ఫ్రెండ్లీగా వుంటాం. ఆయన జెంటిల్మెన్. సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మించారు.
నాన్నగారిలా దర్శకత్వం చేసే ఆలోచన ఉందా?
దర్శకత్వం చాలా కష్టమైన పని. అది నేను చేయలేను.
మీరు ప్రభాస్ గారు కలసి సినిమా చేసే ప్లానింగ్ ఉందా ?
మేము కలసి సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. దానికి ఎప్పుడు టైం వస్తుందో తెలీదు. కానీ తప్పకుండా చేస్తాం.
కొత్త సినిమాల గురించి ?
శ్రీను వైట్ల గారితో చేస్తున్న సినిమా ముఫ్ఫై శాతం అయ్యింది. తర్వాత ప్రసాద్ గారితో ఒక సినిమా వుంటుంది. రాధతో ఒక కథ వర్క్ జరుగుతోంది. అది యూవీ క్రియేషన్స్ లో వుంటుంది.