
బాలీవుడ్ కామెడీ సిరీస్ ‘హేరాఫేరి’ మూడో భాగం చుట్టూ వివాదం రగిలింది. ప్రియదర్శన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ నటిస్తున్న ఈ చిత్రం నుంచి బాబూరావ్ పాత్రధారి పరేష్ రావల్ తప్పుకోవడం సంచలనంగా మారింది. ఈ నిర్ణయం అభిమానులను నిరాశపరిచింది. పరేష్ నిష్క్రమణకు కారణంగా క్రియేటివ్ విభేదాలు, రెమ్యూనరేషన్‌పై అక్షయ్‌తో గొడవలు అని పుకార్లు వచ్చాయి. అయితే, పరేష్ ఈ వాదనలను ఖండించారు. ఇంతలో, అక్షయ్ నిర్మాణ సంస్థ నుంచి పరేష్‌కు రూ. 25 కోట్ల లీగల్ నోటీసు జారీ అయినట్లు తెలిసింది. ఈ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? ‘హేరాఫేరి 3’ విడుదల ఎప్పుడు? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
