హనుమాన్ ఆల్బమ్ సంచలనం: 1 బిలియన్ వ్యూస్‌తో రికార్డ్

WhatsApp Image 2025 06 19 at 10.52.17 11310754

తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్ హీరో జానర్‌ను గర్వంగా పరిచయం చేసిన చిత్రం ‘హనుమాన్’. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించిన ఈ చిత్రంలో తేజ సజ్జ కథానాయకుడిగా నటించి మెప్పించారు. పాన్-ఇండియా స్థాయిలో సంచలన విజయం సాధించిన ఈ సినిమా, తెలుగు ఆడియన్స్‌తో పాటు దేశవ్యాప్తంగా ఆకట్టుకుంది. ఈ చిత్ర విజయంలో సంగీత దర్శకుడు గౌర హరి పాత్ర కీలకం. ఆయన రచించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
ఇప్పుడు ‘హనుమాన్’ ఆల్బమ్ అరుదైన ఘనత సాధించింది. ఈ సినిమా ఆల్బమ్‌కు ఏకంగా 1 బిలియన్ వ్యూస్ దక్కాయి, ఇది తెలుగు సినిమా చరిత్రలో అసాధారణం. ఇలాంటి రికార్డ్ సృష్టించడం సినీ అభిమానులకు గర్వకారణం. అదే జోష్‌తో తేజ సజ్జ, గౌర హరి కాంబినేషన్‌లో మరో సూపర్ హీరో చిత్రం ‘మిరాయ్’ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!