హను-మాన్ చూస్తుంటే ప్రేక్షకులకు గూస్ బంప్స్ వస్తున్నాయి

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. తేజ సజ్జ కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అద్భుతంగా అలరించి ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో చిత్రంలో కథానాయికగా నటించిన అమృత అయ్యర్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

ట్రైలర్ లో ఒక్క చోట కూడా కనిపించలేదు. కానీ సినిమాలో పుల్ లెంత్ రోల్ లో వున్నారు.. ఎలా అనిపించింది ?
దర్శకుడు ప్రశాంత్ వర్మ గారు ముందే ఈ విషయాన్ని చెప్పారు. అందుకే దాని గురించి పెద్దగా అలోచించలేదు. హనుమాన్ సినిమా ప్రేక్షకులు నచ్చాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నాం. మేము అనుకున్నట్లుగా ప్రేక్షకులు గొప్పగా అస్వాదిస్తున్నారు. ఆదరిస్తున్నారు. ఆడియన్స్ తో కలసి చూస్తున్నపుడు వాళ్ళ రెస్పాన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి.

ఈ సినిమా చూసిన తర్వాత మీకు వచ్చిన కాంప్లీమెంట్స్ గురించి ?
సినిమా చుసిన ప్రేక్షకులంతా చాలా గొప్పగా అభినందిస్తున్నారు. చాలా ప్రాధాన్యత వున్న పాత్రని చక్కగా చేశాని చెబుతుంటే చాలా అనందంగా వుంది.

తేజ, వరలక్ష్మీ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
తేజతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. తను చాలా మంచి నటుడు. తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అలాగే వరలక్ష్మీ గారితో కలసి పని చేయడం కూడా మంచి అనుభూతి. ఆమె నుంచి కూడా కొన్ని మెళకువలు నేర్చుకున్నాను. సెట్ లో అందరినీ పరిశీలిస్తాను. ప్రతి ఒక్కరి  నుంచి నేర్చుకోవానికి ఎదో ఒక విషయం వుంటుంది. హనుమాన్ వెరీ మెమరబుల్ జర్నీ. ఈ జర్నీలో సహనంగా వుండటం నేర్చుకున్నాను. ఒక ఆర్టిస్ట్ కి సహనం చాలా ముఖ్యం.

ఎలాంటి పాత్రలు చేయాలని వుంటుంది ?
నటనకు ఆస్కారం వుండే పాత్రలు చేయాలని వుంది. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అలాంటి పాత్రలు వచ్చినా చేయడానికి ఇష్టపడతాను. నా కెరీర్ పట్ల చాలా ఆనందంగా వుంది.

హనుమాన్ 2 ఉంటుందని ప్రశాంత్ గారు చెప్పారా ?
లేదండీ. అందరితో కలసి స్క్రీన్ పై చూసినప్పుడు చాలా సర్ ప్రైజ్ అయ్యాను.

మీ లైఫ్ లో సూపర్ హీరో ఎవరు ?
అమ్మ నాన్న ( నవ్వుతూ)