తేజ సజ్జ అమృత నాయర్ హీరో హీరోయిన్లుగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా హను-మాన్. వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శీను, సముద్రఖని, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో వినయ్ రాయ్ నెగిటివ్ రోల్ లో నటించారు. హరి గౌరా కృష్ణ సౌరబ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. కంప్లీట్ విజువల్ వండర్ లా మంచి విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ తో ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మించారు. స్టార్ట్ టు ఎండ్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా విజువలైజేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ప్రశాంత్ వర్మ డైరెక్షన్ అదిరిపోయింది. తేజ సజ్జ నటించిన తీరు అద్భుతం. క్లైమాక్స్ లో వచ్చే హనుమంతుడి పాట మరియు ఎలివేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సంక్రాంతి పండక్కి మొదటి బ్లాక్ బస్టర్ మూవీ హను-మాన్.
కథ విషయానికొస్తే : స్వార్థానికి సహాయానికి మధ్య వ్యత్యాసాన్ని చాలా బాగా చూపించారు. ఆంజనేయ నామాలు ఉన్న ఒక లింగ రూపంలో ఉన్న శక్తిని చేజిక్కించుకోవాలని ప్రయత్నంలో హీరోకి విలన్ కి మధ్య జరిగే సంఘర్షణ హను-మాన్. ఇంతకీ ఆ శక్తిని విలన్ చేయించుకున్నాడా లేదా హీరో ఎలా అడ్డుకున్నాడు అనేది తెలియాలంటే హను-మాన్ సినిమా చూడాల్సిందే.
నటీనటుల విషయానికొస్తే : హీరోగా తేజ సజ్జ అదరగొట్టాడు. హీరోయిన్ గా అమృత నాయర్ చాలా బాగా నటించింది. అక్క క్యారెక్టర్ లో వరలక్ష్మి శరత్ కుమార్, అలాగే గెటప్ శీను, వెన్నెల కిషోర్ క్యారెక్టర్లు సినిమాకి హైలైట్. నెగిటివ్ షేడ్స్ లో వినయ్ అదరగొట్టాడు.
టెక్నికల్ యాస్పెక్ట్స్ : ప్రశాంత్ వర్మ దర్శకత్వం అద్భుతం. పాటలు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. స్క్రీన్ పైన విజువల్ ఎఫెక్ట్స్ కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి. హనుమంతుడు విగ్రహం వచ్చిన ప్రతిసారి కచ్చితంగా గుస్బంస్ వస్తాయి.
ఈ సంక్రాంతి పండక్కి అదిరిపోయే విజువల్ వండర్ హను-మాన్.
రేటింగ్ : 3.5/5