
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సుమతి శతకం’ సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో తెరకెక్కింది. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా విడుదల అయింది. మహేష్ విట్ట, శైలజమ్మ, టేస్టీ తేజ, జెడివి ప్రసాద్, కరణ్ విజయ్, మిర్చి కిరణ్, ఆకెళ్ళ గోపాల్ కృష్ణ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.
సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి
హలేష్ డిఓపిగా పని చేశారు. ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకున్న ఈ చిత్ర సక్సెస్ మీట్ అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా సీనియర్ నటి మలక్పేట్ శైలజమ్మ మాట్లాడుతూ… “మా చిత్రానికి సపోర్ట్ చేస్తూ మాకు ఇంత మంచి విజయం అందించిన ప్రేక్షకులు అందరికీ థాంక్స్. మంచి కంటెంట్ వస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని మరొకసారి నిరూపించడం జరిగింది. కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం సుమతీ శతకం” అన్నారు.
సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ… “మా చిత్రం ఇంత మంచి విజయం సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం అందరం ఎంతో కష్టపడ్డాము. ప్రతి విషయాన్ని తమ భుజస్కాంతాలపైన వేసుకుని ముందుకు తీసుకువెళ్లిన హీరో అమర్దీప్ గారికి, దర్శకనిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాను మరింత బాగా ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను. ఆదిత్య మ్యూజిక్ వారు మమ్మల్ని ప్రోత్సహించడం చేయడం సంతోషకరం” అన్నారు.
రచయిత బండారు నాయుడు మాట్లాడుతూ… “మా సినిమాను చూసి సినిమా ఎంత బాగుందో సినిమాలోని డైలాగులు కూడా అంతే బాగున్నాయని అంటున్నారు, నాకు సంతోషంగా ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో సుమతీ శతకం చిత్రం చాలా పాజిటివ్ గా ముందుకు వెళుతుంది. ప్రేక్షకులంతా మా సినిమాను చూసి మమ్మల్ని మరింత ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నటుడు మహేష్ విట్టా మాట్లాడుతూ… “ఒక ఆర్టిస్టుకు సరైన పాత్ర రావాలంటే మంచి రచయిత, దర్శకుడు, నిర్మాత తో పాటు సరైన క్యారెక్టర్ కూడా రావాలి. అలా నాకు అన్నీ కలిసి వచ్చిన సినిమా సుమతీ శతకం. నాకు సరైన అవకాశం లేదని అనుకుంటున్న సమయంలో నాకు ఈ సినిమా వచ్చింది. నా క్యారెక్టర్ కు అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన చిత్ర బృందంలో అందరికీ నా ధన్యవాదాలు. సుమారు 15 సంవత్సరాల తర్వాత సెన్సార్ వాళ్లు ఒక కట్, ఒక మ్యూట్, ఒక బ్లర్ లేకుండా సినిమాను సర్టిఫై చేశారు. అటువంటి అద్భుతమైన కథ రాసి, దర్శకత్వం చేసి ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చిన దర్శకుడు ధన్యవాదాలు అనుకుంటున్నాను. త్వరలోనే మరిన్ని చిత్రాలతో మీ ముందుకు రాబోతున్నాను” అన్నారు.
దర్శకుడు ఎంఎం నాయుడు మాట్లాడుతూ… “మా సినిమా సుమతీ శతకం ఇంత మంచి విజయం సాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మాకు సపోర్ట్ చేసిన మీడియా వారికి థాంక్స్. మా నిర్మాత సాయి సుధాకర్ గారు ప్రతి విషయంలో అండగా ఉన్నారు. సినిమాకు మంచి సంగీతం అందించినందుకు సుభాష్ గారికి థాంక్స్. నాతో పాటు ప్రయాణించిన నా టీంకు, సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సినిమాలో అమర్దీప్ ఎన్ని కష్టాలు వచ్చినా ఎక్కడ వెనకడుగు వేయకుండా ఉన్నారు, సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అలాగే హీరోయిన్ శైలి గారు తెలుగు రాకపోయినా కూడా సినిమా కోసం తెలుగు నేర్చుకుంటూ పని చేశారు. శ్రీధర్ గారికి, సాయి సుధాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అన్నారు.
నిర్మాత సాయి సుధాకర్ కొమ్మాలపాటి మాట్లాడుతూ… “సుమతీ శతకం చిత్ర సక్సెస్ మీట్ కు వచ్చిన అందరికీ నమస్కారం. కొత్త వారితో ఒక చిన్న సినిమాగా మొదలై ఈరోజు ఇంత మంచి విజయం సాధించి మీ ముందుకు వచ్చింది. సినిమా చూసిన అందరూ కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం అని అంటున్నారు. ఈ సినిమాలో నటించిన అందరికీ ఒక సంతృప్తి ఉంది. ప్రస్తుతం చిత్రపరిశ్రమలో ఎంతోమంది హాస్య నటీనటులు ఉన్నప్పటికీ వారంతా వేడివేరు పాత్రలు చేయడంలో కాస్త బిజీగా ఉన్నారు. మరి కొంతమంది నటులకు అవకాశాలు కూడా రావడం లేదు. ప్రతిభావంతులైన నటులకు అవకాశాలు తగ్గిపోయాయి. అటువంటి నటీనటులకు విజన్ మూవీ మేకర్స్ అవకాశం ఇస్తుంది. అవకాశం వచ్చినప్పుడు తమను తాము నిరూపించుకోవడానికి ఎంతోమంది ఆర్టిస్టులు సిద్ధంగా ఉన్నారు. అటువంటి వారికి అవకాశం ఇచ్చేందుకు విజన్ మూవీ మేకర్స్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణులు తమదైన శైలిలో సినిమా కోసం బెస్ట్ అందించారు. సినిమాలో నటించిన ఆర్టిస్టులు అందరూ వారి పాత్రకు 100% అవుట్ పుట్ ఇస్తూ తమ ప్రతిభను నిరూపించుకున్నారు. దర్శక బృందం అందరూ పట్టుదలతో పనిచేశారు. నటి శైలి ఈ సినిమాలో టైటిల్ పాత్ర పోషిస్తూ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. సినిమాలో తన పాత్ర తనకు బాగా కనెక్ట్ అయింది అంటూ తెలుగు రాకపోయినా కూడా నేర్చుకుంటూ ఈ సినిమాలో నటించారు. నటుడు అమర్దీప్ ప్రతిభ ఉన్న వ్యక్తికి అవకాశం వస్తే ఎలా ఉంటుంది అని చూపించారు. సుమతీ శతకం చిత్రం ద్వారా అతనికి సరైన అవకాశం వచ్చింది అని భావించి తన బెస్ట్ అందించారు. ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు ప్రేక్షకులు ఈరోజు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. యువతతో పాటు కుటుంబ సమేతంగా వచ్చి ఈ సినిమాలకు చూడడం అనేది సంతోషకరం. అమర్ కు ఇకపై మంచి సినిమా అవకాశాలు ఈ సినిమా నుండి వస్తాయని కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అన్నారు.
హీరోయిన్ శైలి చౌదరి మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు మొదటి రోజు షూటింగ్ చేసిన విషయం కూడా ఈరోజుకి గుర్తుంది, మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ముఖ్యంగా నేను ఈ చిత్ర దర్శకునికి, నిర్మాతకు, అమర్దీప్, ఇతర నటీనటులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రేక్షకులకు, మమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియా వారికి ధన్యవాదాలు. సుమతీ సాంగ్ ద్వారా ఈ సినిమాకు మంచి బజ్ వచ్చింది. నాకు షూటింగ్ సమయంలో సహాయం చేసిన చిత్రబంధం అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అన్నారు.
హీరో అమర్దీప్ మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. నన్ను నమ్మి నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నా దర్శకుడు నాయుడు గారికి, నా నిర్మాత సాయి సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సుభాష్ ఆనంద్ గారికి ఇంత మంచి సంగీతం అందించినందుకు థాంక్స్. ఈ సినిమాకు పనిచేసిన దర్శక బృందం, సాంకేతిక నిపుణులు అలాగే వేరువేరు పాత్రలో నటించిన నటీనటులు అందరికీ నా ధన్యవాదాలు. మీ అందరి సపోర్ట్ ఉండబట్టి ఈ సినిమా ఎంత మంచిగా వచ్చింది. వీరంతా ఈ సినిమాకు నిలబడబట్టి ఈరోజు సినిమా ఇంత అద్భుతంగా రావడం జరిగింది. మమ్మల్ని ఎంత అందంగా చూపించినందుకు హలేష్ గారికి థాంక్స్. ప్రేక్షకులను మెప్పించేందుకు నాకు తెలిసిన ప్రతి విషయంలోను కష్టపడి పని చేశాను. కష్టపడితేనే ఫలితం వస్తుందని మా నాన్నగారు నాకు నేర్పించారు, నేను అదే పాటిస్తున్నాను. ఈ చిత్రబంధం అందరితోనూ కలిసి పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నాతో కలిసి నటించిన శైలి గారు చాలా కష్టపడి తనకి రానివి కూడా నేర్చుకుని ఈ సినిమా కోసం పనిచేశారు. అందుకు ఆమెను ప్రశంసించాలి. డాన్స్ స్టెప్స్ అందించిన గోవింద్ మాస్టర్ కు థాంక్స్. మరొకసారి నా సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఒక్క ఛాన్స్ అడిగినందుకు అవకాశం ఇచ్చిన ప్రేక్షకులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరింత మంచి సినిమాలతో మీ ముందుకు వస్తాను” అంటూ ముగించారు.
