‘కెప్టెన్ మిల్లర్’ నుంచి పవర్ ఫుల్ ‘ఘోర హర’ పాట విడుదల

CAPTAIN MILLER

నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కెప్టెన్ మిల్లర్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం థర్డ్ సింగిల్ ‘ఘోర హర’ పాటని విడుదల చేశారు.

సెన్సేషనల్ కంపోజర్ జివి ప్రకాష్ ఈ పాట కోసం పవర్ ప్యాక్డ్ నెంబర్ ని స్కోర్ చేశారు. రాకేందు మౌళి రాసిన ఇంటెన్స్ లిరిక్స్ ఆకట్టుకున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటని హై ఎనర్జీ వోకల్స్ తో ఆలపించారు. పాటలో వింటేజ్ విజువల్స్  అద్భుతంగా వున్నాయి. ధనుష్ , శివ రాజ్ కుమార్ ల ప్రజెన్స్ ఎక్స్ ట్రార్డినరీగా వుంది. ఈ పాటలో ధనుష్ , శివ రాజ్ కుమార్ కలిసి డ్యాన్స్ చేయడం కన్నుల పండగలా వుంది.

 1930-40 బ్యాక్ డ్రాఫ్ లో హ్యుజ్ బడ్జెట్ తో ఈ  చిత్రం రూపొందుతోంది. డాక్టర్ శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్‌ మోహన్ కథానాయిగా నటిస్తోంది. టి.జి. త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిల్మ్స్, సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌ సహా నిర్మాతలు.

‘కెప్టెన్ మిల్లర్’ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో జనవరి 12న ఏకకాలంలో గ్రాండ్ గా విడుదల కానుంది.

తారాగణం: ధనుష్, ప్రియాంక మోహన్, సందీప్ కిషన్, డాక్టర్ శివ రాజ్ కుమార్

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్
నిర్మాతలు: జి. శరవణన్, సాయి సిద్ధార్థ్
బ్యానర్: సత్యజ్యోతి ఫిల్మ్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: సిద్ధార్థ నుని
ఎడిటింగ్: నాగూరన్
పీఆర్వో: వంశీ-శేఖర్