
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తుల ప్రమోషన్‌తో ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు కొత్త విస్కీ బ్రాండ్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు.
అజయ్ దేవగన్ బాలీవుడ్‌లో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందారు. కానీ, ఆయన చేసే ప్రకటనలు తరచూ వివాదాస్పదమవుతున్నాయి. పాన్ మసాలా, గుట్కా వంటి హానికర ఉత్పత్తులను ప్రమోట్ చేసిన ఆయన, ఇప్పుడు “ది గ్లెన్ జర్నీస్” అనే సింగిల్ మాల్ట్ విస్కీ బ్రాండ్‌ను లాంచ్ చేశారు. స్కాటిష్ హైలాండ్స్‌లో తయారైన ఈ విస్కీని భారత్‌లో హై-ఎండ్ మార్కెట్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, గోవా, చండీగఢ్‌లలో ఈ బ్రాండ్ త్వరలో అందుబాటులోకి రానుంది. అయితే, ఈ నిర్ణయం అజయ్ అభిమానులను నిరాశపరిచింది. సోషల్ మీడియాలో ” ఇతరుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి డబ్బు సంపాదిస్తున్నారు” అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టార్‌గా సామాజిక బాధ్యతను మరచారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
