
కథ:
ఇది మామూలు కథ కాదు.. పగ, ప్రతీకారం, ఆత్మల ఘోష! ఆస్తి కోసం కోడలిని చంపితే.. ఆ తల్లి ఆత్మగా మారి ఎలా ప్రతీకారం తీర్చుకుందో చూపించే పక్కా కమర్షియల్ హారర్ బొమ్మ ఇది. పోలీస్ గా, స్వామీజీగా సుమన్ బాబు చేసిన యాక్షన్, పర్ఫార్మెన్స్ సినిమాకి బ్యాక్ బోన్.
విజిల్స్ పడే సీన్స్:
సినిమాలో సెంటిమెంట్ పిండేశారు. తల్లిగా కారుణ్య చౌదరి నటన కంటతడి పెట్టిస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్, గ్రాఫిక్స్ మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్ లో దడ పుట్టిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు బేబీ తేజస్విని స్క్రీన్ ప్రెజెన్స్ అదిరింది.
తగ్గిన విషయాలు:
కొన్ని సీన్లు బాగా సాగదీసినట్టు అనిపిస్తాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈజీగా చెప్పేయొచ్చు.
తీర్పు:
హారర్, సస్పెన్స్, సెంటిమెంట్.. అన్నీ కలగలిపిన ‘ఎర్రచీర’ మాస్ ఆడియన్స్ ని, ఫ్యామిలీస్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
రేటింగ్: 3/5
