
మే 16 నుండి విడుదల కానున్న “ఎలెవెన్” సినిమా తమిళ్ ప్రీమియర్స్ వేయడం జరిగింది. ప్రీమియర్స్ లో ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. ఈ సినిమా థ్రిల్లర్ జానర్లో రూపొందిందని, చూసే ప్రేక్షకులను పూర్తిగా కట్టిపడేసేలా ఉందని టాక్. నవీన్ చంద్ర నటన గురించి ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆయన నటన అద్భుతంగా ఉందని, సినిమా అంతటా ఆకట్టుకునేలా చేసిందని టాక్.దర్శకుడు లోకేష్ ఈ సినిమా కథను చాలా ఆకర్షణీయంగా తెరకెక్కించారట. స్క్రీన్‌ప్లే అత్యంత గ్రిప్పింగ్‌గా ఉందని, ప్రేక్షకులను ఒక్క క్షణం కూడా విసుగు లేకుండా చేసింది.సినిమాలోని యువ నటులు కూడా తమ నటనతో మంచి ముద్ర వేశారు. వారి ప్రదర్శన అత్యంత సహజంగా, ఆకట్టుకునేలా ఉందని క్రిటిక్స్ ప్రశంసించారు.సంగీత దర్శకుడు డి. ఇమ్మాన్ ఈ సినిమాకు అందించిన సంగీతం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. ఈ థ్రిల్లర్ జానర్‌కు తగ్గట్టుగా సంగీతం చాలా విభిన్నంగా, అద్భుతంగా ఉందని, ఇది ఇమ్మాన్‌కు కొత్త జానర్ అయినప్పటికీ ఆయన న్యాయం చేశారని అన్నారు.ఈ సినిమా అద్భుతంగా రూపొందిందని అన్నారు. ఈ సినిమా బడ్జెట్ పరిమితులను అధిగమించి, ప్రేక్షకులకు ఒక మంచి అనుభవాన్ని అందించిందని తెలిపారు.మొత్తం మీద “ఎలెవెన్” సినిమా ఒక థ్రిల్లింగ్ అనుభవాన్ని అందిస్తుందని, సినిమా ప్రియులు తప్పక చూడాల్సిన చిత్రమని క్రిటిక్స్ సిఫార్సు చేశారు. మే 16 న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.