దిల్ రాజు డ్రీమ్స్ – కొత్త ట్యాలెంట్‌కు బిగ్ ఛాన్స్

Dill Raju dreams

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కొత్త ట్యాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ‘దిల్ రాజు డ్రీమ్స్’ సంస్థ ద్వారా కొత్త అవకాశం కల్పిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌తో ఎంతో మంది నూతన దర్శకులకు అవకాశం ఇచ్చిన దిల్ రాజు, ఈ సంస్థ ద్వారా సినిమా రంగంలో కొత్తవారిని పరిచయం చేయనున్నారు. ఆసక్తిగల వారు తమ రిజిస్ట్రేషన్‌ను వెబ్‌సైట్ ద్వారా పంపవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటన సినీ పరిశ్రమలో ఆసక్తి రేపుతోంది. దిల్ రాజు ఈ చర్యకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.