
కమల్ హాసన్ నటిస్తున్న ‘థగ్ లైఫ్’ చిత్రం మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోంది. ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న ఈ సినిమాపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ ఈవెంట్కు హాజరైన సందర్భంలో, కమల్ కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ కన్నడ అభిమానులను ఆగ్రహానికి గురిచేశాయి. కర్ణాటక ప్రజలు సామాజిక మాధ్యమాల్లో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం సినిమా రిలీజ్పై ఎలాంటి ప్రభావం చూపనుందనేది ఆసక్తికరంగా మారింది. కమల్ ఈ విషయంపై స్పష్టత ఇస్తారా అనేది చూడాలి.