సంక్రాంతికి చిరు-నయన్ రచ్చ – అనిల్ రావిపూడితో మెగా ఫన్ రైడ్

WhatsApp Image 2025 05 17 at 12.29.57 c1e0d38c

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జోడీ మరోసారి అభిమానులను అలరించడానికి రెడీ. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్ 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ‘సైరా’, ‘గాడ్ ఫాదర్’ తర్వాత చిరుతో నయన్ మళ్లీ జత కట్టడం ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. ఈ సినిమా కోసం నయన్ రూ. 18 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాలీవుడ్ బజ్. ప్రోమోలో నయన్‌ ‘సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం’ డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. బీమ్స్ సిసిరోలియో సంగీతంతో ‘వింటేజ్ చిరు’ మ్యాజిక్‌ను తిరిగి చూపించనున్న ఈ చిత్రం ఫన్ రైడ్‌గా రాబోతోంది. అనిల్ మార్క్ కామెడీ, చిరు ఎనర్జీ, నయన్ క్రేజ్‌తో ఈ మూవీ బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించనుందని అభిమానులు ఆశిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ జోడీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది!