
మెగాస్టార్ చిరంజీవి, నయనతార జోడీగా అనీల్ రావిపూడి రూపొందిస్తున్న కొత్త చిత్రం అభిమానుల్లో జోష్ నింపుతోంది. చిరు స్టైల్లో ఫుల్ డోస్ కామెడీ, ఎంటర్టైన్మెంట్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల షూటింగ్ ఆరంభమైన ఈ ప్రాజెక్ట్ మొదటి షెడ్యూల్‌ను వేగంగా పూర్తి చేసి అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఒక రోజు ముందుగానే ప్యాకప్ చెప్పిన అనీల్ టీమ్ వర్క్‌కు ఫిదా కాకుండా ఉండలేము! రెండో షెడ్యూల్ సన్నాహాలు ఇప్పటికే స్టార్ట్. అనీల్ మార్క్ కామెడీ, చిరు మ్యాజిక్ కలగలిస్తే ఈ సినిమా సంక్రాంతి 2026లో థియేటర్లను కళకళలాడించనుంది. అభిమానులు ఈ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ మూవీ హైప్ ఆల్రెడీ పీక్స్‌లో ఉంది. “చిరు-అనీల్ కాంబో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది” అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి సీజన్లో ఈ చిత్రంతో సినీ ప్రియులకు డబుల్ ధమాకా గ్యారంటీ.