
అక్కినేని నాగచైతన్య తన 24వ చిత్రం ‘వృషకర్మ’తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చైతూ నిధి అన్వేషకుడిగా కనిపించనున్నాడు. హీరోయిన్ మీనాక్షి చౌదరి పురావస్తు శాస్త్రవేత్తగా నటిస్తూ, చైతూతో సాహసాలు హైలైట్‌గా నిలవనున్నాయి. చైతూ కొత్త మేకోవర్‌తో ఈ చిత్రం కోసం శ్రమించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో రూ.10 కోట్లతో భారీ గుహ సెట్ నిర్మించారు. ఈ సెట్‌లో కీలక సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరిస్తున్నారు. ఈ ఏడాదిలో విడుదల కానున్న ‘వృషకర్మ’ సంచలనం సృష్టించనుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.