
తెలుగు బుల్లితెర సంచలన షో ‘బిగ్ బాస్’ సీజన్ 9 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి హోస్ట్ ఎవరనే చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బాలకృష్ణ హోస్ట్‌గా వస్తారనే రూమర్స్ హల్‌చల్ చేశాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, కింగ్ నాగార్జుననే సీజన్ 9 హోస్ట్‌గా నిర్వాహకులు ఖరారు చేశారు. నాగ్ కోట్ చేసిన భారీ రెమ్యూనరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్న ఈ సీజన్ కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. నాగార్జున హోస్టింగ్‌తో ఈసారి ‘బిగ్ బాస్’ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. గత సీజన్లలో నాగ్ మ్యాజిక్ ప్రేక్షకులను అలరించిన నేపథ్యంలో, ఈసారి కూడా రచ్చ ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.