
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ నటించిన లేటెస్ట్ మూవీ భైరవం. చాలా రోజులుగా ఈ మూవీ పై మంచి బజ్ ఉంది. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ చిత్రం నేడు విడుదలైంది. పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ ఈ మూవీని నిర్మించారు. ఇక ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ: తూర్పు గోదావరి జిల్లా దేవీపురంలో వారాహి అమ్మవారి గుడిని నాగరత్నమ్మ చూసుకుంటుంది. ఆమె తన మనవడు వరద (నారా రోహిత్), గజపతి (మనోజ్ మంచు), శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్)లను సొంత మనవళ్లలా పెంచుతుంది. నాగరత్నమ్మ మరణం తర్వాత, నాగరాజు (అజయ్) గుడిని ఆక్రమించాలని చూస్తాడు. గజపతి, వరదలు శ్రీనును ట్రస్టీగా నియమిస్తారు. అయితే, గజపతి ఒక సంక్షోభంలో చిక్కుకుంటాడు. నాగరాజు, గజపతి బావమరిది పులి (సందీప్ రాజ్) అతని ప్రాణాలు కాపాడతారు. ఈ క్రమంలో గజపతి తన స్నేహితుడు వరదను చంపాల్సిన పరిస్థితి వస్తుంది. శ్రీను ఆ నేరాన్ని తనపై వేసుకొని పోలీసులకు లొంగిపోతాడు. ఆ తర్వాత ఏమైంది? శ్రీను ఎందుకిలా చేశాడు? వరదకు ఏమైంది? అనేది మిగిలిన కథ.
కథనం: విజయ్ కనకమేడల దర్శకత్వంలో తమిళ చిత్రం గరుడన్ రీమేక్‌గా వచ్చిన భైరవం తెలుగు ఆడియన్స్‌కు తగ్గట్టు చిన్న మార్పులతో రూపొందింది. ఫస్టాఫ్ నెమ్మదిగా సాగినా, ముగ్గురు హీరోల మధ్య బాండింగ్ బాగా చూపించారు. శ్రీను-అదితి శంకర్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో కథ వేగవంతమై, ప్రీ-ఇంటర్వెల్ యాక్షన్, క్లైమాక్స్ హైలైట్ అనే చెప్పాలి. నారా రోహిత్ పాత్ర సైలెంట్‌గా ఆకట్టుకుంటుంది. కథలో ట్విస్ట్‌లు ఆసక్తికరంగా ఉన్నా, స్క్రీన్‌ప్లే కొంత బలహీనంగా ఉంది.
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్ క్లైమాక్స్‌లో అదరగొట్టాడు. మనోజ్ మంచు యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. నారా రోహిత్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అదితి శంకర్, ఆనంది, జయసుధ, అజయ్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్: శ్రీ చరణ్ పాకలా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది, కానీ ఎడిటింగ్ బలహీనం. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
మొత్తానికి భైరవం రూరల్ మాస్ డ్రామాగా ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్, క్లైమాక్స్, ముగ్గురు హీరోల కోసం ఒకసారి చూడొచ్చు.
రేటింగ్: 3/5