బెల్లంకొండ శ్రీనివాస్ రాంగ్ రూట్ హంగామా

Screenshot 2025 05 15 073535

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ సమీపంలో టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సృష్టించిన గందరగోళం సంచలనం రేపింది. మంగళవారం సాయంత్రం తన కారును రాంగ్ రూట్‌లో నడుపుతూ ట్రాఫిక్ కానిస్టేబుల్‌పైకి వెళ్లిన శ్రీనివాస్, క్షణాల్లో వార్తల్లో నిలిచాడు. కానిస్టేబుల్ కారును అడ్డుకుని రాంగ్ రూట్ గురించి ప్రశ్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. కానిస్టేబుల్ గట్టిగా నిలదీయడంతో శ్రీనివాస్ కారును వెనక్కి తీసుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. “సినీ హీరోలు కూడా చట్టానికి అతీతులు కాదు” అంటూ నెటిజన్లు కామెంట్లు పోస్టు చేస్తున్నారు. కానిస్టేబుల్ ట్రాఫిక్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భైరవం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న శ్రీనివాస్ ఇమేజ్‌పై ఈ ఘటన ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.