
మాస్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘భైరవం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో సరికొత్త లుక్‌తో, రూటెడ్ కథాంశంతో ఆయన ఆకట్టుకోనున్నాడు. డ్యాన్స్, యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల్లో తనదైన శైలిని చూపించేందుకు సిద్ధమయ్యాడు. టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించాయి. రెండున్నర సంవత్సరాల విరామం తర్వాత వస్తున్న ఈ చిత్రంలో సాయి శ్రీనివాస్ కఠోర శ్రమతో సరికొత్త రూపంలో కనిపించనున్నాడు. సెన్సార్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆయన కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సాయి శ్రీనివాస్, యూనిట్‌తో కలిసి అగ్రెసివ్‌గా ప్రచారం చేస్తున్నాడు.
