
నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానులకు డబుల్ ధమాకా. ‘అఖండ 2’ షూటింగ్ జోరుగా సాగుతుండగా, బాలయ్య బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్! మాస్ హిట్ ‘లక్ష్మీ నరసింహా’ రీ-రిలీజ్‌కు సిద్ధమైంది. జూన్ 7 నుంచి థియేటర్లలో సందడి చేయనున్న ఈ చిత్రం, జూన్ 10న బాలయ్య పుట్టినరోజును పండగలా చేయనుంది. జయంత్ సి పరాన్జీ డైరెక్షన్‌లో, మణిశర్మ మ్యూజిక్‌తో అప్పట్లో బాక్సాఫీస్‌ను గడగడలాడించిన ఈ మూవీ, ఇప్పుడు మళ్లీ వెండితెరపై మాస్ జాతర చేయనుంది. ‘అఖండ 2’ ట్రీట్‌లతో పాటు ఈ రీ-రిలీజ్ బాలయ్య ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ ఇవ్వనుంది. ఈ మాస్ హంగామా ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.