వెంకీ-ధనుష్‌ కాంబోలో మరో బ్లాక్‌బస్టర్‌: సితార బ్యానర్‌లో సంచలనం

Screenshot 2025 06 02 150346

దర్శకుడు వెంకీ అట్లూరి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో మరో సంచలన చిత్రానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం సూర్య, మమితా బైజు జంటగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న వెంకీ, గ్రాండ్‌ పూజా కార్యక్రమంతో షూటింగ్‌ ప్రారంభించాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ధనుష్‌తో మరో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన ‘సార్‌’ సినిమా తెలుగు, తమిళ బాక్సాఫీస్‌లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు యూత్‌ను ఆకట్టుకునే కొత్త కథతో వెంకీ ధనుష్‌ను మళ్లీ సెట్స్‌పైకి తీసుకొస్తున్నాడు. నాగవంశీ నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రం సితార బ్యానర్‌లోనే తెరకెక్కనుంది. ఇటీవల ధనుష్‌ ‘కుబేర’ సినిమాను శేఖర్‌ కమ్మల దర్శకత్వంలో పూర్తి చేశాడు. ఈ సినిమా ఆడియో లాంచ్‌ చెన్నైలో ఘనంగా జరిగింది. వెంకీ-ధనుష్‌ కాంబో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్‌ చేయడానికి సిద్ధమవుతోంది.