
టాలీవుడ్ హీరో సుమంత్ నటించిన ‘అనగనగా’ ఓటీటీలో హవాను చూపిస్తోంది. ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఎమోషనల్ డ్రామాను సన్నీ సంజయ్ డైరెక్ట్ చేశారు. సుమంత్, మాస్టర్ విహార్ష్‌ల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సుమంత్ నటనతో పాటు విహార్ష్ పెర్ఫామెన్స్ కూడా ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటడం విశేషం. మూవీ టీం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టర్‌తో సెలబ్రేట్ చేసింది. ‘అనగనగా’ సుమంత్ కెరీర్‌లో గట్టి కంబ్యాక్‌గా నిలిచింది. ఎమోషనల్ కంటెంట్‌తో ఓటీటీ ప్రియులను ఆకట్టుకున్న ఈ చిత్రం, తెలుగు సినిమాకు మంచి ఎంటర్‌టైనర్‌గా మారింది.