
‘పుష్ప 2’తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్, అమెరికాలో జరిగే నాట్స్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. జూలై 4-6లో ఫ్లోరిడాలోని టాంపాలో జరిగే ఈ సంబరాలు తెలుగు సంస్కృతిని ప్రపంచ వేదికపై చాటుతాయి. బన్నీ రాకతో అమెరికాలోని తెలుగు ప్రేక్షకుల్లో ఉత్సాహం నెలకొంది. నాట్స్ నిర్వాహకులు బన్నీ పాల్గొనడం గర్వకారణమని తెలిపారు. అల్లు అర్జున్ స్టార్డమ్, చలాకీతనం ఈ వేడుకలకు మరింత ఆకర్షణను తెస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అట్లీతో భారీ చిత్రం కోసం సన్నాహాలు చేస్తున్న బన్నీ, ఈ ఈవెంట్లో తెలుగు వారితో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు.