
అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని లెనిన్ సినిమాతో మాస్ అవతారంలో సిద్ధమవుతున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హై-ఎనర్జీ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అఖిల్ నుంచి గట్టి కంబ్యాక్ ఆశిస్తున్న అభిమానులకు ఈ చిత్రం థియేటర్లలో జోష్ నింపనుంది. తాజా అప్డేట్ ప్రకారం, లెనిన్ 2025 నవంబర్ 14న విడుదల కానుందని తెలుస్తోంది. అయితే, ఈ రిలీజ్ డేట్‌పై అభిమానులు సోషల్ మీడియాలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. దసరా లేదా దీపావళి సీజన్లో ఈ మాస్ మూవీ రావాలని కొందరు ఆశించారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. అఖిల్ డైనమిక్ లుక్, శ్రీలీల గ్లామర్, మాస్ యాక్షన్ సన్నివేశాలతో లెనిన్ బాక్సాఫీస్‌ను కుదిపేస్తుందని అంటున్నారు.