అఖిల్ ‘లెనిన్’- క్లైమాక్స్ షూట్‌తో దసరా రిలీజ్‌కు సిద్ధం

Screenshot 2025 05 15 082751

అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం దర్శకుడు మురళీ కిషోర్ దర్శకత్వంలో రూపొందుతోంది. చిత్తూరు నేపథ్యంలో రాయలసీమ యాసలో అఖిల్ నటన హైలైట్‌గా నిలవనుంది. జూన్ మొదటి వారంలో స్పెషల్ సెట్‌లో క్లైమాక్స్, స్టంట్ సీన్స్ షూట్ చేయనున్నారు. అనంతరం ఓ పాటను కూడా చిత్రీకరిస్తారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం దసరా సందర్భంగా విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అఖిల్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.