
ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని ఏపీ ఎఫ్డిసి చైర్మన్ గా ఎన్నికైన పి భరత్ భూషణ్ గారికి అభినందనలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ గతంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా విధులు నిర్వహించి అటు కార్మికులకు, ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎంతో అనుభవజ్ఞులైన భరత్ భూషణ్ గారికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎఫ్ డి సి చైర్మన్ గా నియమించడం సంతోషకరం. ఆయన సినిమా ఇండస్ట్రీని ఆంధ్ర ప్రదేశ్ లో మరింత అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాము.
