
నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్‌లో ఉన్నారు. గోపీచంద్ మలినేనితో కొత్త సినిమా సెట్స్‌పైకి రానుంది. మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం బాలయ్య 111వ సినిమాగా రాబోతోంది.
బాలయ్య బాబు ఇటీవల వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు గోపీచంద్ మలినేనితో కలిసి 111వ సినిమాకు సిద్ధమయ్యారు. ఈ చిత్రం మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోంది. సెకండ్ హాఫ్‌లో బాలయ్య పాత్రకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ ఎమోషనల్ డ్రామాతో ఆకట్టుకోనుందని సమాచారం. యాక్షన్ సీన్స్ ఈ సినిమా హైలైట్‌గా నిలవనున్నాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని గోపీచంద్ చరిత్రలో నిలిచేలా తీర్చిదిద్దుతున్నారు. స్క్రిప్ట్ పూర్తయిన ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. బాలయ్య అభిమానులకు ఈ చిత్రం విజువల్ ట్రీట్‌గా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాతో బాలయ్య మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.
