
‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ రీ రిలీజ్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. అయినా, ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’పై ఆశలు ఎక్కువగా ఉన్నాయి. రాజమౌళి ప్రమోషన్‌తో ఈ చిత్రం హిట్ అవుతుందని అంచనా.
జేమ్స్ కామెరూన్ రూపొందించిన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ రీ రిలీజ్ డిస్నీ ప్లాన్ ప్రకారం థియేటర్లలోకి వచ్చినా, కలెక్షన్లు నిరాశపరిచాయి. కేవలం మూడేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం ఇంకా ప్రేక్షకుల మదిలో తాజాగా ఉండటంతో, మళ్లీ థియేటర్‌కు వెళ్లే ఆసక్తి చూపలేదు. ఈ రీ రిలీజ్ కేవలం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రమోషన్ కోసం చేసిన ప్రయత్నమే అట. ఈ ఫ్లాప్ రాబోయే సినిమాపై ప్రభావం చూపదని నిపుణులు అంటున్నారు. డిసెంబర్‌లో విడుదల కానున్న ‘ఫైర్ అండ్ యాష్’ కోసం డిస్నీ భారీ ప్రమోషన్ స్ట్రాటజీని సిద్ధం చేస్తోంది. ఇండియాలో స్క్రీన్ కౌంట్ పెంచడంతో పాటు, రాజమౌళి లాంటి గ్లోబల్ డైరెక్టర్‌ను ప్రమోషన్‌లో భాగం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. SSMB29 టీజర్‌ను ఈ సినిమాతో జతచేసి హైప్ పెంచే అవకాశం ఉంది. రాజమౌళి బ్రాండ్, అవతార్ ఫ్రాంచైజ్ క్రేజ్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేయనుంది.
