
మలయాళ నటి శ్వేతా మేనన్‌పై కొచ్చి పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ప్రముఖ సామాజిక కార్యకర్త ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. శ్వేతా నటించిన కొన్ని సినిమాల్లోని అభ్యంతరకర సన్నివేశాలు, ప్రకటనలపై ఆరోపణలు వచ్చాయి. ఈ సమయంలో ఆమె ‘అమ్మ’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండటం చర్చనీయాంశమైంది. శ్వేతా తన కెరీర్‌లో పలు రొమాంటిక్ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది. అలాగే బాలీవుడ్, టాలీవుడ్‌లో కూడా ఈమె నటించి, మెప్పించింది.
శ్వేతా మేనన్‌పై కొచ్చి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె నటించిన సినిమాల్లోని అభ్యంతరకర సన్నివేశాలు, సోషల్ మీడియాలో ప్రసారమైన వాణిజ్య ప్రకటనలపై ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మార్టిన్ ఫిర్యాదు చేశారు. ఎర్నాకుళం కోర్టు ఆదేశాలతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. శ్వేతా యువతను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ సమయంలో ఆమె ‘అమ్మ’ అధ్యక్ష పదవికి పోటీ చేయడం గమనార్హం. శ్వేతా తెలుగులో ‘ఆనందం’, ‘రాజన్న’ సినిమాల్లో నటించింది.‘అనస్వరం’, ‘రతి నిర్వేదం’ లాంటి సినిమాలతో యాత్ లో పాపులరిటీ సంపాదించింది ఈ బ్యూటీ.