
బాలీవుడ్ బాదీ షారుఖ్ ఖాన్ షూటింగ్లో గాయపడినట్లు తెలుస్తోంది. ‘కింగ్’ మూవీ షూటింగ్లో స్టంట్స్ చేస్తుండగా ఆయన ప్రమాదానికి గురైనట్లు జాతీయ మీడియా పేర్కొంది. చికిత్స కోసం US వెళ్లారని, గాయాల తీవ్రత తక్కువేనని తెలిపింది. మల్టిపుల్ మజిల్ ఇంజురీ అయినట్లు పేర్కొంది. నెల రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు డాక్టర్లు సూచించినట్లు సమాచారం. OCT లేదా నవంబర్లో షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశముంది.
