స్పెషల్ సాంగ్‌లతో సంచలనాలు సృష్టిస్తున్న పూజా హెగ్డే

pooja hegde coolie 275742824 1x1 1

పూజా హెగ్డే సినిమాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తోంది. స్పెషల్ సాంగ్‌లతో ఆకట్టుకుంటూ భారీ రెమ్యూనరేషన్‌తో వార్తల్లో నిలుస్తోంది. కూలీ చిత్రంలో మోనిక సాంగ్ లో ఆమె అదిరిపోయే డాన్స్‌తో మళ్ళీ వైరల్ అవుతుంది.

పూజా హెగ్డే ఇప్పుడు స్పెషల్ సాంగ్‌ల వైపు మొగ్గు చూపుతోంది. సూపర్ స్టార్ కూలీ చిత్రంలో ఆమె మోనిక అనే స్పెషల్ సాంగ్‌ చేసి మళ్ళీ వైరల్ అవుతుంది. అయితే ఈ ఒక్క పాట కోసం ఆమె రూ. 2 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఆమె డాన్స్ నైపుణ్యం, గ్లామర్‌తో పాటు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. గతంలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్‌లు కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఈ క్రమంలో పూజా ఎంచుకున్న ఈ మార్గం ఆమె కెరీర్‌కు కొత్త ఊపు తీసుకొస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అభిమానులు కూడా ఆమె నటన, డాన్స్‌లను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కూలీ సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ బిగ్ స్క్రీన్ పై ఎలా ఉండబోతుందో చూడాలని ఆరాటపడుతున్నారు.