‘ఎల్లమ్మ’ సంచలన నిర్ణయం తీసుకున్న నితిన్

Screenshot 2025 07 15 162729

టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘బలగం’ దర్శకుడు వేణు యెల్దండి తాజాగా ‘ఎల్లమ్మ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తుండగా, స్టార్ నిర్మాత దిల్ రాజు నిర్మాణ బాధ్యతలు స్వీకరించారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

‘బలగం’ చిత్రంతో దర్శకుడిగా అద్భుత విజయం సాధించిన వేణు యెల్దండి తన రెండో చిత్రం ‘ఎల్లమ్మ’ కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. నితిన్ ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ తీసుకోకుండా, లాభాల్లో వాటా పొందేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇటీవల నితిన్, దిల్ రాజు కలిసి చేసిన ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన నేపథ్యంలో ఈ నిర్ణయం ఆసక్తి రేపుతోంది. హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. ఈ సినిమాతో నితిన్ మరో హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు.