“కన్నప్ప” చిత్ర రివ్యూ & రేటింగ్

1000508587

మంచు మోహన్ బాబు నిర్మాతగా 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచి విష్ణు టైటిల్ పాత్రలోని తంగప్ప పాత్ర పోషిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ దర్శకత్వం చేయగా ఎందరో దిగ్గజ నటీనటులు వివిధ పాత్రలను పోషించారు. వారిలో ముఖ్యంగా అక్షయ్ కుమార్, మంచు మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, మధుబాల, ముఖేష్, రఘుబాబు, శివ బాలాజీ, కౌశల్, అర్పిత్, బ్రహ్మానందం, సప్తగిరి తదితరులు కీలకపాత్ర పోషించారు. ప్రీతి ముకుందన్ ఈ చిత్రంలో విష్ణు తో జంటగా నటిస్తూ హీరోయిన్ గా అలరించారు. ఈ చిత్రానికి షెల్డన్ సినిమాటోగ్రాఫర్ గా చేయగా స్టీఫెన్ దేవసీ సంగీతాన్ని అందించారు.

కథ :

కన్నప్ప చిత్ర కథ సాధారణంగా పురాణాలు, చరిత్ర ద్వారా అందరికీ తెలిసిన కథ మాత్రమే. అయితే తిన్నడు అయిన ఓ ఆటవికుడు రెండవ శతకంలో కన్నప్పగా ఎలా మారుతాడు అనేది నేటి చరం ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించడమే ఈ చిత్ర ప్రయత్నం. అసలు దేవుడిని నమ్మని ఓ వ్యక్తి చివరికి ఎంతో దైవభక్తితో తన కళ్ళని కూడా శివునికి భక్తితో అర్పిరావడమేతవరకు రావడమే ఈ చిత్ర ప్రయాణం.

నటీనటుల నటన :

ఈ చిత్రంలో కన్నప్ప పాత్ర పోషిస్తూ మంచి విష్ణు ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నేటి వరకు ఎన్నో చిత్రాలలో మంచి విష్ణు నటించినప్పటికీ ఈ చిత్రం తన సినీ కెరియర్ లోనే ఒక మార్క్ సృష్టించే విధంగా ఈ చిత్రంలో నటించారు. రెండవ శతాబ్దం నాకి ఓ అటవీకుడిలా అటు శారీరకంగా దృఢంగా కనిపించే విధంగా, అలాగే కాస్త గ్రాంథికం కలిసేలా నాటి భాష నేటి ప్రజలకు కూడా అర్థమయ్యేలా డైలాగులు చెప్పడంలో కూడా ఎక్కడ తగలబడకుండా అద్భుతంగా నటించారు.

అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ శివపార్వతుల వలె నటిస్తూ గతంలో మనం ఎన్నో చిత్రంలో శివపార్వతులను చూసినప్పటికీ వీరి జంట కూడా శివపార్వతుల కనిపించడంలో ఎక్కడ తగ్గకుండా సంపూర్ణంగా అనిపించేలా ఉన్నారు.

శరత్ కుమార్ చిత్రంలో అంతటా లేకపోయినా తాను స్క్రీన్ పై కనిపించినంత సమయంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మోహన్ లాల్ తక్కువగా కనిపించినప్పటికీ మంచి ఇంపాక్ట్ సృష్టించారు.

అలాగే మధుబాల, ముఖేష్, రఘుబాబు, బ్రహ్మానందం, సప్తగిరి, శివ బాలాజీ, కౌశల్ తమదైన పాత్ర పరిధిలో చాలా చక్కటి పర్ఫార్మర్స్ ఇచ్చారు. ఆనాటి మహాభారతంలో నటించిన అర్పిత్ ఈ చిత్రంలో ఒక మంచి నేటివ్ పాత్ర పోషిస్తూ ప్రేక్షకులను మెప్పించారు.

మంచు మోహన్ బాబు గారు ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లి డైలాగులు చెప్పినట్లు ఎంత అద్భుతమైన పర్ఫార్మన్స్ ఇస్తూ ఒక సీన్లు తండ్రి కొడుకులకు పోటీ రాగా తన తండ్రిని మించిన నటన నటిస్తూ మంచి విష్ణు నిలబడ్డారు.

అలాగే ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూసిన ప్రభాస్ పాత్ర రుద్ర రూపంలో తలపై కనిపించినతసేపు సినిమా అంతా ప్రేక్షకులకు కనుల పండగ అందిస్తూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో కట్టిపడేశారు.

ప్రీతి ముకుందన్ కథానాయకగా మంచి విష్ణు పక్కన ఎంతో సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇస్తూ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేయడం జరిగింది.

సాంకేతిక విశ్లేషణ :

ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప చిత్రాన్ని వెండితెరపై చూపించడంలో పూర్తిగా విజయం సాధించడం చెప్పుకోవాలి. ప్రతి నటీనటుడిని వాడుకోవడంలో దర్శకుడు సక్సెస్ సాధించారు. నిర్మాణ విలువ విషయంలో 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ ఎక్కడ కాంప్రమైజ్ అయినట్లు అనిపించడం లేదు. మోహన్ బాబు గారు ఈ చిత్రం నిర్మించడం అనేది తన కళగా తీసుకుని నేటి తరానికి అందరికీ ఈ చిత్రం తెలియాలి అనే ఓ ఆకాంక్షతో ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చారు. పాటలు ఇంకా బిజిఎం అద్భుతంగా ఉన్నాయి. సిజిఐ చేసినవి కూడా చాలా బాగా సింక్ అయ్యాయి. అక్కడక్కడ విఎఫ్ఎక్స్ కాస్త బాగా అనిపించలేదు. రెండగ భాగంతో పోలిస్తే మొదటి భాగం కొంచెం స్లోగా అనిపిస్తుంది. మొదటి భాగంలో కొన్ని అనవసరమైన సన్నివేశాలులా అనిపించాయి.

ప్లస్ పాయింట్స్ :

కథ, నటీనటుల నటన, పాటలు, దర్శకత్వం, నిర్మాణ విలువలు, క్లైమాక్స్.

మైనస్ పాయింట్స్ :

మొదటి భాగంలో కొన్ని అనవసరమైన సన్నివేశాలు, కొన్ని విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్.

సారాంశం :

కుటుంబ సమేతంగా తప్పక చూడాల్సిన చిత్రం – నేటి తరం వారు తెలుసుకోవాల్సిన చరిత్ర.

రేటింగ్ : 3.5/5