‘కూలీ’లో అమీర్ ఖాన్ సంచలనం – ఎన్ని నిమిషాల స్క్రీన్ టైమ్ అంటే…

Screenshot 2025 06 17 155455

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అంచనాలను మించనుంది. సినిమాకు సంబంధించి రోజూ కొత్త వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రల్లో కనిపిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఓ పవర్‌పుల్ క్యామియో రోల్‌లో నటిస్తున్నారు. ఆయన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోనుందని చిత్ర బృందం అంటోంది. అమీర్ ఖాన్ స్క్రీన్ టైమ్ కేవలం 8 నిమిషాలైనా, ఆ పాత్ర ప్రభావం ఎనలేనిదని టాక్. ఈ క్లైమాక్స్ సీన్‌లో అమీర్‌తో పాటు రజనీకాంత్ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ కానుంది. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ‘కూలీ’తో అమీర్ ఖాన్ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.