
హీరో కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాతో బ్లాక్బస్టర్ అందుకున్నాడు, కానీ వెంటనే ‘దిల్రూబా’తో నిరాశపరిచాడు. ఈ రెండు చిత్రాల నిర్మాణానికి ఏళ్లు పట్టాయి. ఇప్పుడు ‘K ర్యాంప్’లో నటిస్తూ, అది పూర్తి కాకముందే ‘చెన్నై లవ్ స్టోరీ’ని అనౌన్స్ చేశాడు. అయితే, సినిమాలు ప్రకటించడం తేలికైనా, వాటిని పూర్తి చేయడానికి కిరణ్ చాలా కాలం తీసుకోవడం విమర్శలకు దారితీస్తోంది. మిడ్ రేంజ్ హీరోలు ఒక్కో సినిమాకు రెండేళ్లు తీసుకుంటే, థియేటర్లలో రిలీజ్ల కొరతతో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. మిడ్ రేంజ్ చిత్రాలే థియేటర్లను నడిపిస్తాయని, కిరణ్ లాంటి హీరోలు వేగం పెంచాలని సినీ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ విమర్శలపై కిరణ్ ఎలా స్పందిస్తాడు? స్పీడ్ అప్ చేసి అభిమానులను అలరిస్తాడా? లేక మరో ఆలస్యంతో ఆశలు గల్లంతు చేస్తాడా? వేచి చూడాలి.