రామ్ చరణ్ – త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌ ఇక లేనట్టేనా…

ramcharan 1593072440 1610702483

సినీ అభిమానులకు షాకింగ్ అప్‌డేట్! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా లైనప్‌లో ఊహించని మలుపు. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా కోసం చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పక్కనపెట్టారు. రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే సుకుమార్‌తో మరో భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు.
అయితే, అసలు ట్విస్ట్ ఇదే! సుకుమార్ సినిమా తర్వాత రామ్ చరణ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్ దాదాపు ఖాయమైనా, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్రివిక్రమ్ కథ రామ్ చరణ్‌కు నచ్చినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. భవిష్యత్తులో ఈ జోడి కలిసే అవకాశం ఉందా? లేదా? అనేది సస్పెన్స్‌గా మిగిలిపోయింది.