మరోసారి మనసు దోచుకుంటున్న “అందాల రాక్షసి”

WhatsApp Image 2025 06 13 at 16.20.46 362b6889

నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పత్రం నటిస్తూ 2012 ఆగస్టు 10వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అప్పట్లో బ్లాక్ బస్టర్ సెన్సేషన్ గా నిలిచిన ఈ చిత్రం అటు యూత్ ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా ఇంతకనో ఆకట్టుకుంది. అయితే సుమారు 13 సంవత్సరాల తర్వాత నేడు మరోసారి ఈ చిత్రం జరిగింది. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి ఈ చిత్రం ఒక మార్క్ సృష్టించగా నవీన్ చంద్ర నటన జీవితానికి ఓ పెద్ద మలుపుగా మారింది.

అయితే నేటి పరిస్థితులలో కొత్తగా విడుదలైన చిత్రాలకే అంతంత మాత్రమే టికెట్లు బుక్ అవుతుండగా ఇన్ని సంవత్సరాలు తర్వాత రీ రిలీజ్ అయిన ఈ చిత్రానికి మాత్రం హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాదులోని సంధ్య థియేటర్లో హౌస్ ఫుల్ బోర్డు కనిపించడం అనేది మామూలు విషయం కాదు అటువంటిది అక్కడ హౌస్ ఫుల్ బోర్డు కనిపించడం ఈ చిత్ర రీ రిలీజ్ ఎంత సక్సెస్ అయిందో అర్థమవుతుంది. రీ రిలీజ్ నడుస్తున్న ప్రస్తుత పరిస్థితులలో చాలా అరుదైన చిత్రాలు మాత్రమే సక్సెస్ సాధిస్తున్నాయి. ఆ సక్సెస్ సాధించే రీ రిలీజ్ చిత్రాలలో అందాల రాక్షసి నిలవడం గొప్ప విజయం అని చెప్పుకోవచ్చు.