
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో పాన్-వరల్డ్ స్థాయి భారీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత బన్నీ లైనప్‌లో మరిన్ని భారీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అయితే, గతంలో టాక్ వచ్చిన దర్శకుడు త్రివిక్రమ్‌తో సినిమా ప్రస్తుతానికి ఆగినట్లు తెలుస్తోంది. మరోవైపు, సందీప్ రెడ్డి వంగతో అనుకున్న ప్రాజెక్ట్ కూడా హోల్డ్‌లో ఉందని సమాచారం.
ఇదిలా ఉంటే, లేటెస్ట్ బజ్ ఒకటి ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో అల్లు అర్జున్ ఓ భారీ చిత్రం కోసం చేతులు కలిపినట్లు తెలుస్తోంది. గతంలో నిర్మాత దిల్ రాజు, ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌కే బన్నీ హీరోగా ఖరారైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ భారీ కాంబో నిజమైతే, అభిమానులకు పండగే! కానీ, ఈ వార్తలో నిజం ఎంతో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.