గోపీచంద్ హిస్టారికల్ డ్రామా.. ఫస్ట్ లుక్‌తో అదరగొట్టిన మ్యాచో స్టార్

WhatsApp Image 2025 06 12 at 09.12.46 962d4a3b

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ గత ఏడాది ‘విశ్వం’తో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన ‘ఘాజీ’, ‘అంతరిక్షం’ వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డితో జతకట్టారు. ఈ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ హిస్టారికల్ డ్రామా నుంచి తాజాగా ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్‌లో ఆయన యోధుడి అవతారంలో డైనమిక్‌గా కనిపిస్తున్నారు. గ్లింప్స్‌లో ఆకట్టుకునే విజువల్స్, శక్తివంతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాపై ఆసక్తి రెట్టింపు చేశాయి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రం భారత చరిత్రలో మరుగున పడిన ఒక అధ్యాయాన్ని తెరపైకి తీసుకొస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో మణికందన్ ఎస్ సినిమాటోగ్రఫీ, చిన్నా ప్రొడక్షన్ డిజైన్, పృథ్వీ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. సినిమా షూటింగ్ ఇప్పటికే కాశ్మీర్‌లో ప్రారంభమై, హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ కొనసాగుతోంది. త్వరలో టైటిల్, ఇతర నటీనటుల వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ చిత్రం గోపీచంద్ కెరీర్‌లో మరో మైలురాయి అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.