
దిగ్గజ దర్శకుడు గురుదత్ 100వ జయంతి సందర్భంగా బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ ఆయన జీవిత కథను తెరపైకి తీసుకొస్తున్నాడు. అల్ట్రా మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ గ్రూప్ ఈ బయోపిక్‌ను గురుదత్ ఫిల్మోగ్రఫీ హక్కులతో రూపొందిస్తోంది. ‘యూరి’, ‘చావా’ లాంటి హిట్స్‌తో ఆకట్టుకున్న విక్కీ, ఈ పాత్ర కోసం కొత్త లుక్‌లో సిద్ధమవుతున్నాడు. గురుదత్ వారసత్వానికి న్యాయం చేసే ఈ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ప్యాసా’, ‘కాగజ్ కే ఫూల్’, ‘చౌద్విన్ కా చంద్’ లాంటి గురుదత్ క్లాసిక్‌ల 4K వెర్షన్‌లు సందడి చేశాయి. జులై 9న గురుదత్ శతజయంతి సందర్భంగా ఈ చిత్రాలు భారత థియేటర్లలో రీ-రిలీజ్ కానున్నాయి. వారం రోజుల నివాళి కార్యక్రమంతో గురుదత్ సినీ సంపదను ఘనంగా స్మరించనున్నారు. సినీ ప్రియులకు ఈ బయోపిక్, రీ-రిలీజ్‌లు ఓ విజువల్ ట్రీట్‌గా నిలవనున్నాయి.
