
అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో కొత్త చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై సినీ ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. అల్లు అర్జున్ క్యారెక్టర్‌పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ‘ఐకాన్’ టైటిల్ ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ టైటిల్‌తో అల్లు అర్జున్ ప్రకటించిన సినిమా ఆగిపోయినప్పటికీ, ఇప్పుడు మళ్లీ ఈ టైటిల్ చర్చలోకి రావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అట్లీ దర్శకత్వ ప్రతిభ, అల్లు అర్జున్ స్టార్డమ్ కలిసి ఈ సినిమాను బాక్సాఫీస్ హిట్‌గా నిలపనుందని అభిమానులు ఆశిస్తున్నారు.