
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆగస్ట్ 14న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ హక్కుల కోసం ఓవర్సీస్ మార్కెట్‌లో తీవ్ర పోటీ నడుస్తోంది. పంపిణీదారులు భారీ ఆఫర్లతో ముందుకొస్తున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్‌లో రికార్డులు తిరగరాస్తుందని డిస్ట్రిబ్యూటర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉపేంద్ర, అక్కినేని నాగార్జున, శ్రుతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. రజినీ మ్యాజిక్‌తో అభిమానులను అలరించేందుకు ఈ చిత్రం సిద్ధమవుతోంది. సినిమా టీజర్, ట్రైలర్‌లు ఇప్పటికే అభిమానుల్లో హైప్ పెంచాయి. ఈ సినిమా రజినీ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.