
అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం దర్శకుడు మురళీ కిషోర్ దర్శకత్వంలో రూపొందుతోంది. చిత్తూరు నేపథ్యంలో రాయలసీమ యాసలో అఖిల్ నటన హైలైట్గా నిలవనుంది. జూన్ మొదటి వారంలో స్పెషల్ సెట్లో క్లైమాక్స్, స్టంట్ సీన్స్ షూట్ చేయనున్నారు. అనంతరం ఓ పాటను కూడా చిత్రీకరిస్తారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం దసరా సందర్భంగా విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అఖిల్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
