మాచో స్టార్ గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భీమా’. ఈ చిత్రానికి ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పలు పోస్టర్స్ గోపీచంద్ ను యాక్షన్ ప్యాక్డ్ అవతార్ లో ప్రజెంట్ చేశాయి.
ఈ రోజు మేకర్స్ టీజర్ అప్డేట్ ఇచ్చారు. భీమా టీజర్ జనవరి5న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. టీజర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో గోపిచంద్ చైర్ లో కూర్చున్న లుక్ ఇంటెన్స్ గా వుంది. ఈ చిత్రంలో గోపిచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు.
స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. రమణ వంక ప్రొడక్షన్ డిజైన్, తమ్మిరాజు ఎడిటర్. కిరణ్ ఆన్లైన్ ఎడిటర్ కాగా, అజ్జు మహంకాళి డైలాగ్స్ అందిస్తున్నారు. రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ ఫైట్స్ ని కొరియోగ్రఫీ చేస్తున్నారు.
తారాగణం: గోపీచంద్, ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: ఎ హర్ష
నిర్మాత: కేకే రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
డీవోపీ: స్వామి జె గౌడ
సంగీతం: రవి బస్రూర్
ఎడిటర్: తమ్మిరాజు
పీఆర్వో: వంశీ-శేఖర్